గత నాలుగు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా పెరిగాయి. మార్చి 19, శుక్రవారం నాటి బంగారం ధరలను పెరిశీలిస్తే స్వల్పంగా పెరుగుదల నమోదైంది. తాజా మార్కెట్ ధరలను పరిశీలిస్తే..
హైద్రాబాద్ లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 42,200 ఉండగా ఈరోజు రూ. 42,210 గా నమోదైంది. అంటే ఒక గ్రాము బంగారం ధర రూ. 4,221 గా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. నిన్న రూ. 46,040 ఉండగా ఈరోజు రూ. 46,050 గా ఉంది. అంటే ఒక గ్రాము బంగారం ధర రూ. 4,605 గా ఉంది.
హైదరాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖలో కూడా ఇవే బంగారం ధరలు ఉన్నాయి. బంగారం ధరలు పెరగగా వెండి ధరల్లో మాత్రం స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 72, 000 గా ఉంది. తులం వెండి ధర రూ. 720 గా ఉంది.