దేశీయంగా బంగారం ధరల్లో మరోసారి పెరుగుదల కనిపించింది. నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు తాజాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అంటే మార్చి 14న బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 150 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 42,000 వేలకు చేరుకుంది. ఒక గ్రాము బంగారం ధర రూ. 4,200 గా ఉంది.
24 క్యారెట్ల మేలిమి బంగారం ధర పై నిన్నటితో పోలిస్తే.. రూ. 170 పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ. 45, 820 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర రూ. 4,582 గా ఉంది. హైదరాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
బంగారం వెంటే వెండి ధరలు కూడా పయనించాయి. హైదరాబాద్ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే వెండి ధర రూ. 700 లు పెరిగింది. దీంతో కేజీ వెండి రూ. 71,400 రూపాయలు పలుకుతుంది. 10 గ్రాముల వెండి ధర రూ. 714 గా ఉంది. బంగారం, వెండి ధరలు వివిధ అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసేవారు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.