logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

బ్రేకింగ్: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు 13.03. 2021 బంగారం ధరలు

మన దేశంలో బంగారానికి ఉన్న విలువ గురించి తెలిసిందే. శుభకార్యం ఏదైనా బంగారం కొనడానికే మహిళలు ఆసక్తి చూపుతుంటారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతుండటం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం. ఇక రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు శనివారం రోజున భారీగా పడిపోయాయి.

హైద్రాబాద్ మార్కెట్లో శనివారం రోజున అంటే మార్చి 13 బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే.. నగల తయారీకి వినియోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 300 తగ్గింది. రూ.41,840కి చేరింది. 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ప్రస్తుతం రూ. 4,184 కు లభిస్తుంది.

అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. నిన్నటితో పోలిస్తే.. రూ.330 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,650 కి చేరింది. ఒక గ్రాము బంగారం ధర రూ. 4,564 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ఇక బంగారంతో పాటుగా వెండి ధర కూడా భారీగా దిగొచ్చింది.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2,500 తగ్గి రూ. 70,700కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో ఆ ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గాయి. అయితే ఈ ధరలు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి కాబట్టి కొనుగోలు చేసేవారు ధరలను మరొక్కసారి సరి చూసుకోవడం మంచిది.

 

Related News
%d bloggers like this: