బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారతాయో అంచనా వేయడం కష్టం. తాజా మార్కెట్ ధరలు బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయి. రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ప్రస్తుతం భారీగా దిగొచ్చాయి. దేశ రాజధాని న్యూ ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో ఆ ప్రభావం తాజా మార్కెట్ ధరలపై పడింది. శనివారం నాడు అంటే మార్చి 27 న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 41,700గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గింది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,170 గా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,490 గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.330 తగ్గింది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,549 గా ఉంది. పెరిగిన ధరలు హైదరాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖ లోను ఇదే విధంగా ఉన్నాయి.
బంగారం ధరతో పాటె వెండి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీ వెండి ధరపై రూ. 100 పెరిగింది. దీంతో వెండి ధర రూ. 69,500 కు చేరుకుంది. ఒక్క తులం వెండి ధర రూ. 695 గా ఉంది. వెండి, బంగారం ధరలు వివిధ అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి బంగారం కొనేముందు ధరలను మరొక్కసారి పరిశీలించుకోవడం మంచింది.