ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండటం, మరోవైపు వచ్చే నెలంతా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. గత పది రోజులుగా పెరిగిన ధరలను పరిశీలిస్తే రానున్న రోజుల్లో కూడా ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8 వ తేదీన అంటే గురువారం రోజున బంగార, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైద్రాబాదు మార్కెట్ లోని ధరలను పరిశీలిస్తే.. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 350 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 43,000 కు చేరుకుంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,300 కు లభిస్తుంది. అదే విధంగా పెట్టుబడులకు అనువైన 24 క్యారెట్ల బంగారం ధరలను చూసినట్లయితే.. నిన్నటితో పోలిస్తే ధర రూ. 370 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 46,900 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,300 గా ఉంది.
ఇక వెండి విధయానికొస్తే.. నిన్న భారీగా పెరిగిన వెండి గురువారం రోజున అదే బాటలో పయనించింది. నిన్నటితో పోలిస్తే కేజీ వెండి ధర ఈరోజు రూ. 400 లకు పెరిగింది. ప్రస్తుతం తులం వెండి ధర రూ. 709 కు లభిస్తుంది. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు సాధారణమే. కాబట్టి కొనేముందు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.