అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో మరోసారి బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24 న అంటే శనివారం రోజున బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా హైదరాబాద్ మార్కెట్లోని ధరలను పరిశీలిస్తే.. నగల తయారీకి వాడే 10 గ్రాముల బంగారం ధరపై రూ. 10 తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 44,790 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,479 కు లభిస్తుంది. పెట్టుబడులకు అనువైన 24 క్యారెట్ల బంగారం ధరపై కూడా స్వల్పంగా రూ. 10 తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ. 44,860 కు లభిస్తుంది. ఒక్క గ్రాము బంగారం కొనాలంటే రూ. 4,886 గా ఉంది. బంగారం ధరలు హైదరాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖ లోనూ ఇదే విధంగా ఉన్నాయి.
ఇక వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి. వెండి ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 74,300గా ఉంది. తులం వెండి రూ. 743గా ఉంది. బంగారం, వెండి ధరలు వివిధ అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.