బంగారంధరలు మరోసారి పైకి ఎగిశాయి. గత ఏడు నెలలుగా బంగారం ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కొద్దీ రోజులుగా బంగారం ధరలను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. మరోవైపు కరోనా కారణంగా కూడా ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19వ తేదీన అంటే సోమవారం రోజున బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైద్రాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై నిన్నటితో పోలిస్తే రూ. 90 పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 44,250 కు చేరుకుంది. అలాగే ఒక్క గ్రాము బంగారం రూ. 4,425కు లభిస్తుంది. 24 క్యారెట్ల బంగారం ధరపై కూడా రూ. 100 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 48,270 కు చేరుకుంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4827కు లభిస్తుంది. హైదరాబాద్ తో పాటుగా విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
ఇక వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి. వెండి ధరలు గత నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 73,700గా ఉంది. తులం వెండి రూ. 737గా ఉంది. బంగారం, వెండి ధరలు వివిధ అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.