logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

శుభవార్త: తగ్గిన బంగారం ధరలు 16.04.2021 బంగారం, వెండి ధరలు

కొన్ని రోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు బంగారం ధరలు తగ్గుతాయా అని కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి బంగారం ధరలు దిగొచ్చాయి. దీంతో బంగారం కొనేవారికి భారీ ఊరట లభించింది. ఏప్రిల్ 16 వ తేదీన అంటే శుక్రవారం రోజున మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం నగల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 10 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 43,690 గా ఉంది. అలాగే ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,369గా ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర పై రూ. 10 తగ్గింది. ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,660 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,766 గా ఉంది. హైదరాబాద్ తో పాటుగా విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

బంగారం ధరలు తగ్గితే వెండి ధర మాత్రం కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 71,900 గా ఉంది. ఒక్క తులం వెండి రూ. 719 కు లభిస్తుంది. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు వివిధ అంతర్జాతీయ, భౌగోళిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొనేముందు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.

Related News