కొన్ని రోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు బంగారం ధరలు తగ్గుతాయా అని కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో బంగారం ధరలు రెండు రోజులుగా భారీగా తగ్గాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు దిగొచ్చాయి. దీంతో బంగారం కొనేవారికి భారీ ఊరట లభించింది. మార్చి 31 వ తేదీన అంటే బుధవారం రోజున మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం నగల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 250 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 41,000 గా ఉంది. అలాగే ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,110 గా ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర పై రూ. 270 తగ్గింది. ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 44,840 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,484 గా ఉంది. హైదరాబాద్ తో పాటుగా విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
బంగారం ధరలు తగ్గితే వెండి ధర మాత్రం పైపైకి కదిలింది. కేజీ వెండి ధరపై రూ. 200 పెరగడంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 68,700 గా ఉంది. ఒక్క తులం వెండి రూ. 687 కు లభిస్తుంది.