logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

దూసుకెళ్తున్న బంగారం ధరలు: 09.04. 2021 బంగారం, వెండి ధరలు

బంగారం ధరల్లో మరోసారి స్వల్ప పెరుగుదల నమోదైంది. బంగారంతో పాటుగా వెండి ధర కూడా పెరిగింది. ఏప్రిల్ నెలలో బంగారం ధరలు పెరగడం వరుసగా ఇది ఆరోసారి కావడం విశేషం. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడం, బంగారం పై పెట్టుబడులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఏప్రిల్ 9వ తేదీన అంటే శుక్రవారం రోజున హైద్రాబాద్ మార్కెట్ లోని ధరలు ఇలా ఉన్నాయి. నగల తయారీకి వాడే 22 గక్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,010 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,301 గా ఉంది. పెట్టుబడులకు అనువైన 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 46,910 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,691 గా ఉంది. హైద్రాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖలోని ఇవే ధరలు ఉన్నాయి.

బంగారం ఇలా ఉంటె వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 72,100 గా ఉంది. తులం వెండి రూ. 721 కు లభిస్తుంది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి కొనేముందు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.

Related News