logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి 06.04. 2021 బంగారం, వెండి ధరలు

రెండు రోజులుగా స్వల్ప పెరుగుదల నమోదు చేసుకున్న బంగారం ధరలు తాజాగా మరోసారి పైకి ఎగిశాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఏప్రిల్ 6వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

హైదరాబాద్ మార్కెట్లోని బంగారం ధరలను పరిశీలిస్తే.. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర పై నిన్నటితో పోలిస్తే రూ. 140 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం రూ. 42,400 కు లభిస్తుంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,240 గా ఉంది. అదే విధంగా పెట్టుబడులకు అనువైన 24 క్యారెట్ల బంగారం ధరలు కూడా పెరిగాయి. తులం బంగారం పై నిన్నటితో పోలిస్తే రూ. 150 పెరిగింది. తులం బంగారం రూ. 46,250 కు లభిస్తుంది. ఒక్క గ్రాము బంగార ధర రూ. 4,625గా ఉంది. హైదరాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖలోని ఇవే ధరలు ఉన్నాయి.

బంగారం ధరలు ఇలా ఉంటె వెండి ధరలు మాత్రం ఈరోజు స్థిరంగా కొనసాగాయి. నిన్న కేజీ వెండి ధర రూ. 69,300 గా ఉండగా ఈరోజు కూడా ఇదే ధర కొనసాగింది. తులం వెండి ధర రూ. 693 గా ఉంది. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూ ఉంటాయి. కాబట్టి కొనేముందు మరొక్కసారి ధరలను సరిచూసుకోవడం మంచిది.

Related News