ఒకానొక సమయంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం ధరలు తర్వాత తగ్గుతూ వచ్చాయి. ఇక హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న బంగారం ధర గురువారం మరింత తగ్గింది. ఇక వెండి విషయంలో మాత్రం ధర స్వల్పంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీన తెలుగురాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,090 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం కొనాలంటే రూ. 4,109 కు లభిస్తుంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధరను చూస్తే.. 10 గ్రాముల బంగారం ధర రూ. 44,830 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,483 గా ఉంది.
బంగారం ధరలు హైదరాబాద్ తో పాటుగా విశాఖ, విజయవాడలోనూ ఇదే విధంగా ఉన్నాయి. బంగారం ధరలు తగ్గుతుంటే వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన వెండి ధర ఈరోజు కూడా భారీగా పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 67,600 గా ఉంది. తులం వెండి రూ. 676 కు లభిస్తుంది.