logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్..!

ప్రముఖ ఇన్స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ ను ప్రవేశ పెట్టనుంది. ఇప్పటి వరకు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఫార్వార్డ్ మెసేజిలు, ఫోటోలు వీడియోలను డిలీట్ చేయలేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెల్సిందే. దీంతో అక్కరకు రాని జంక్ డేటా ఫోన్ స్టోరేజిని ఆక్రమిస్తుంది.

ఈ సమస్యను గుర్తించిన సంస్థ అందుకోసం స్టోర్ మానెజ్మెంట్ ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ లో అవసరం లేని ఫోటోలు, వీడియోలను సులభంగా క్లీన్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని సంస్థ ప్రకటించింది. వాట్సాప్ లో 5 ఎంబి కంటే ఎక్కువ స్టోరేజి కలిగిన డేటాను విడివిడిగా చూపుతుందని దీని వల్ల ఫోన్ లో అవసరం ఉన్న అవసరం లేని డేటాను సులభంగా గుర్తించి డిలీట్ చేసుకోవచ్చని తెలిపింది.

ఒకటి కన్నా ఎక్కువ ఫైల్స్ ను డిలీట్ చేసే ముందు వాటిని మరలా ఓసారి తిరిగి చెక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఫీచర్ ను ఈ వారం లోపే విడుదల చేస్తున్నట్టుగా తెలిపింది. వాట్సాప్ లో స్టోరేజ్ ఆప్షన్ లోని స్టోరేజ్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఈ ఆప్షన్ ను సెట్ చేసుకోవచ్చని వాట్సాప్ వివరించింది.

Related News