logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మీడియాకు కరోనా తప్ప మరో వార్త లేదు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ హీరోయిన్ కుష్బూ సుందర్ కు సంబందించిన ఓ ఆడియో టేప్ ఇప్పుడు కలకలం రేపుతోంది. మీడియా వాళ్ళను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆ వీడియో టేప్ బయటకు లీక్ అవడంతో జర్నలిస్టులు ఆమెపై మండిపడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన కుష్బూ ఆ ఆడియోను ఎవరో కావాలనే ఎడిట్ చేసారని తెలిపారు. తాను తన ముప్పై ఎల్లా కెరీర్ లో ఇప్పటివరకు మీడియా వాళ్ళను అగౌరవపరచలేదన్నారు.

తన గురించి మీడియా వాళ్లకు తెలుసునాని ఈ వివాదం కారణంగా నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటె నన్నుక్షమించండి అంటూ ఆమె ట్విట్టర్ ద్వారా కోరారు. ఇంతకీ ఆ ఆడియో టేప్ లో ఏముందంటే.. ఇటీవల టీవీ సీరియళ్లు, సినిమా షూటింగులకు ప్రభుత్వం అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. 70 రోజుల విరామం తర్వాత తిరిగి షూటింగులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో కుష్బూ నిర్మాతల వాట్సాప్ గ్రూపులో ఓ ఆడియోను పోస్ట్ చేసారు.

మీడియా వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మన వద్దకు రానివ్వకండి. వాళ్లకు ప్రస్తుతం కరోనా తప్ప మరో వార్తలు లేవు. ఇప్పుడు షూటింగ్ ప్రారంభం కాగానే మన మీద పడతారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అనేది అందులోని సారాంశం. ఈ ఆడియోను ఆ వాట్సాప్ గ్రూపులో నుంచే ఒకరు బయటకు లీక్ చేసారు. మీడియాను ఉద్దేశించి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన నటులను కూడా మీడియా వెలుగులోకి తెచ్చిందని, ఉత్తరాది నుంచి వచ్చిన కుష్బూ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి తమిళ జర్నలిస్టులు ఆమెను హెచ్చరించారు.

Related News