logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

రాహుల్ గాంధీకి షాక్.. కాగ్రెస్ పార్టీలో కుష్బూ వ్యాఖ్యల కలకలం

బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమిళనాడు కాంగ్రెస్ మహిళా నేత కుష్బూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. ఇప్పటివరకు దక్షణాది నుండి కాంగ్రెస్ పార్టీకి ఆమె వెన్నుదన్నుగా నిలిచారు. కాగా ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి.

అదే విధంగా కుష్బూ కూడా దీనిని స్వాగతించారు. ఈ నేపథ్యంలో కుష్బూ అనేక విమర్శలు ఎదుర్కుంటున్నారు. దీంతో ఆమె స్వయంగా దీనిపై వివరణ ఇచ్చారు. అంతే కాదు రాహుల్ గాంధీ పేరు ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముందుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం పట్ల రాహుల్ గాంధీకి ఆమె క్షమాపణ చెప్పారు.

తనపై వస్తున్న విమర్శలపై మాట్లాడుతూ.. నేనేమీ రోబోను కాదు. కీలు బొమ్మలా అధిష్టానానికి అనుకూలంగా ప్రతి విషయంలో తలూపాల్సిన అవసరం లేదు. నేను పార్టీలో ఉన్నప్పటికీ నా వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిస్తానన్నారు. ఓ సాధారణ పౌరురాలిగా ఈ విషయం పై తన వైఖరిని ధైర్యంగా చెప్పానన్నారు. దీనితో పార్టీకి ఎలాంటి సంబంధం ఉండబోదని కుష్బూ వివరణ ఇచ్చారు.

Related News