logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

బీజేపీ నేత కుష్బూ కారుకు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ నేత!

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కాగా ఆ సమయంలో కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని కుష్బూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కారు ప్రమాదానికి గురైన ఫోటోలను పోస్ట్ చేసి అభిమానుల ఆశీస్సులు, దేవుడి దయతో తాను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానని ఆమె వ్యాఖ్యానించారు.

కడలూరులో జరగనున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కుష్బూ బుధవారం ఉదయం తన కారులో బయలుదేరారు. వాహనం చెన్నైలోని మెల్మరువతుర్ సమీపానికి రాగానే ఆమె కారును లారీ కంటైనర్ ఢీ కొట్టింది. కారు ఒకవైపు భాగమంతా నుజ్జునుజ్జయింది. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కుష్బూ సురక్షితంగా బయటపడగలిగారు.

Related News