logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

పొలంలో దొరికిన వ‌జ్రం.. కోటీశ్వ‌రుడైన క‌ర్నూలు రైతు

అదృష్టం అనేది ఎప్పుడు, ఎవ‌రికి, ఎలా త‌లుపు తడుతుండో తెలియ‌దు అని పెద్ద‌లు అంటూ ఉంటారు. క‌ర్నూలులో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న చూస్తుంటే ఈ మాట నిజ‌మే అనిపిస్తోంది. పొలం ప‌నుల‌కు వెళ్లిన ఒక రైతు కోటీశ్వ‌రుడ‌య్యాడు. పొలంలో విత్త‌నాలు నాటేందుకు భూమిని సిద్ధం చేసుకుంటుండ‌గా అరుదైన వ‌జ్రం దొరికడంతో ఆ క‌ర్ష‌కుడి ద‌శ తిరిగింది. ఆ వ‌జ్రాన్ని అమ్మితే పెద్ద ఎత్తున డ‌బ్బు అత‌డి స్వంతం కావ‌డంతో ఒక్క రోజులో రైతు జీవిత‌మే మారిపోయింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌ర్నూలు జిల్లా తుగ్గ‌లి మండ‌లం చిన్న జొన్న‌గిరి గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గ్రామానికి చెందిన ఒక రైతు వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్తం త‌న పొలానికి వెళ్లాడు. పొలం ప‌నులు చేసుకుంటుండ‌గా మిల‌మిలా మెరుస్తూ ఒక రాయి లాంటిది అత‌డికి క‌నిపించింది. ద‌గ్గ‌ర‌కు వెళ్లి చూడ‌గానే ఎప్పుడూ చూడ‌ని అరుదైన రాయిగా ఉండ‌టంతో అది వ‌జ్రం కావొచ్చ‌ని అనుమానించాడు. ఈ ప్రాంతంలో అప్పుడ‌ప్పుడు వ‌జ్రాలు దొరుకుతుంటాయి.

దీంతో ఎవ‌రికీ చెప్ప‌కుండా వ‌జ్రాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. స్థానికంగా ఉండే ఓ బంగారు, వ‌జ్రాల వ్యాపారికి ఈ వ‌జ్రాన్ని చూపించాడు. నిజంగానే వ‌జ్రం అని నిర్ధారించుకున్న వ్యాపారి దానిని కొనేందుకు ముందుకొచ్చాడు. 30 క్యారెట్ల బ‌రువున్న ఈ వ‌జ్రాన్ని ఒక కోటి 20 ల‌క్ష‌ల రూపాయాల‌కు రైతు వ‌ద్ద నుంచి కొనుగోలు చేసిన‌ట్ల తెలిసింది. బ‌య‌టి మార్కెట్‌లో ఈ వ‌జ్రం ధ‌ర సుమారు రూ.2 కోట్ల వ‌ర‌కు ప‌లుకుతుంద‌ని అంచ‌నా.

అయితే, ఈ విష‌యాన్ని స‌ద‌రు రైతు, వ్యాపారి బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. కానీ, ఇటువంటి విష‌యాలు ఎక్కువ‌కాలం దాచిపెట్లేరు క‌దా. అందుకే బ‌య‌ట‌కు పొక్కింది. ఈ ప్రాంతంలో ప్ర‌తీ సంవ‌త్స‌రం తొల‌క‌రి వ‌ర్షాలు కురిసిన‌ప్పుడు వ‌జ్రాలు దొరుకుతూ ఉంటాయి. ఈ వ‌జ్రాల వేట‌లో చాలా మంది స్థానికులు నిమ‌గ్న‌మ‌వుతారు. బ‌య‌టి ప్రాంతాల వారు కూడా ఇక్క‌డికి వ‌చ్చి స్థానిక ఎర్ర నేల‌ల్లో వ‌జ్రాల‌ను వెతుకుతూ ఉంటారు. ప్ర‌తీ యేటా సుమారు 50 మందికి ఇలా వ‌జ్రాలు దొరుకుతూ ఉంటాయ‌ని స్థానికులు చెబుతుంటారు.

Related News
%d bloggers like this: