జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. టీఆర్ఎస్ బీజేపీ పార్టల నడుమ నువ్వా నేనా అనే రీతిలో పోటీ కొనసాగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఊహించని రీతిలో బీజేపీ ఆధిక్యం సాధించింది. ఆ ఆతరువాతి స్థానంలో టీఆర్ఎస్ ఉంది. కూకట్పల్లి జోన్లో ఉన్న 22 డివిజన్లలో 20 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పూర్తైన కౌంటింగ్ ప్రకారం టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. కూకట్పల్లి పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ కాలనీ, హైదర్‌నగర్, అల్విన్ కాలనీలో అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తి ఆధిక్యంతో దూసుకుపోతుంది. అలాగే బాలానగర్, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి నగర్, భారతీనగర్ లలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.