logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఎంఐఎంతో పొత్తు లేదు.. మాకేమైనా పిచ్చా?: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో రాజకీయం వేడెక్కుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడానికి అన్ని రకాలుగా సిద్దమవుతుంది. కాగా టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షమైన ఎంఐఎంతో గ్రేటర్ ఎన్నికల్లో పొత్తు వుండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేసారు. ఒంటరిగానే 150 స్థానాల్లో గెలుస్తామన్నారు. గత ఎన్నికల్లో 5 చోట్ల ఎంఐఎం ను ఓడించామని రాబోయే ఎన్నికల్లో మరో 10 స్థానాల్లో గెలిచి తీరుతామన్నారు. ఈసారి కూడా మా అభ్యర్థే మేయర్ అవుతారు. మాకేమైనా పిచ్చా? ఎంఐఎంకు ఎందుకిస్తాం? జీహెచ్ఎంసీలో రెండో స్థానంలో ఎవరొస్తారో మాకు సంబంధం లేదు. ఆ విషయం కాంగ్రెస్, బీజేపీలు తేల్చుకోవాలన్నారు.

దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్నారు. బీజేపీకి గతంలో వచ్చిన ఫలితాలే ఇప్పుడు కూడా వస్తాయన్నారు. అలాగే హైద్రాబాద్లో కొందరు విద్వేషపూరిత వాతావరణం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీపై నిప్పులు చెరిగారు. శాంతి బధ్రతహలకు భంగం కలిగించిన వారిపై ఉక్కు పాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చారు. అరాచకం కావాలా? అభివృద్ధి కావాలా అనే విషయం ప్రజలే తేల్చుకోవాలన్నారు.

 

 

Related News