logo

తెలంగాణ ప్రజలకు కేటీఆర్ దీపావళి కానుక..!

దీపావళి సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రజలకు శుభవార్త వినిపించారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందన్నారు కేటీఆర్. ఆ ప్రభావం ప్రభుత్వం పైన కూడా పడిందన్నారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ భేటీలో ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నామన్నారు.

అందులో భాగంగా 2020- 21 సంవత్సరానికి హైదరాబాద్ తో పాటుగా అన్ని పట్టణాల్లోని ప్రజలకు ప్రాపర్టీ ట్యాక్స్ లో ఊరటనివ్వాలని నిర్ణయించామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.15 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్టుగా కేటీఆర్ పేర్కొన్నారు. ఇతర పట్టణాల్లో రూ.10 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ ప్రకటించారు. ఈ పన్ను రాయితీ కారణంగా జిహెచ్ఎంసి పరిధిలోని 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు.

పన్ను రాయితీతో ప్రభుత్వంపై రూ.196.48 కోట్ల భారం పడుతుందని అన్నారు. అదే విధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో నష్టపోయిన వారికి మరో అవకాశాన్ని ఇవ్వనున్నామన్నారు. ఈ సేవలను పొందేందుకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.

 

 

 

Related News