logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ పీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దుబ్బాక ఎన్నిక‌లు, తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై మీడియాతో ఆయ‌న చిట్‌ఛాట్ చేశారు. రేవంత్ రెడ్డిపై చాలా అరుదుగా మాట్లాడే కేటీఆర్ ఈసారి ఆయ‌న‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి మొద‌ట టీడీపీలో ఉండేవార‌ని, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నార‌ని చెప్పారు. రేపు ఆయ‌న బీజేపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని కేటీఆర్ అన్నారు.

పూట‌కో పార్టీ మారే రేవంత్ రెడ్డి ఒక లీడ‌రా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఖ‌త‌మేన‌ని కేటీఆర్ అన్నారు. అడ్డి మార్ గుడ్డి దెబ్బ లాగా రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచాడ‌ని, ఆయ‌న ఒక లీడ‌ర్ కాద‌ని, పొలిటిక‌ల్ కామెంటేట‌ర్‌గా మారిపోయార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ పైనా, ఆ పార్టీ భ‌విష్య‌త్‌పైనా కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌ని అయిపోయింద‌న్నారు.

కాంగ్రెస్ నేత‌లు త‌లో దిక్కు చూస్తున్నార‌ని, కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్‌లోకి కూడా వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని కేటీఆర్ చెప్పారు. మ‌రికొంద‌రు బీజేపీలోకి వెళ్లాల‌ని చూస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు మిగిలేది గుండు సున్నా అని అన్నారు. స‌మ‌ర్థులైన కాంగ్రెస్ నేత‌ల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటే త‌ప్పేమీ లేద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంటే, కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు త‌మ పార్టీ సిద్ధంగా ఉంద‌ని కేటీఆర్ సిగ్న‌ల్స్ పంపించారు.

మ‌రోవైపు బీజేపీపైన కూడా కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ఒక సంస్కారం లేని పార్టీ అని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి స్థానానికి కూడా గౌర‌వం ఇవ్వ‌కుండా ఇష్ట‌మున్న‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. తాము తిట్టాల‌నుకుంటే వారి కంటే ఎక్కువ తిట్ట‌గ‌ల‌మ‌ని, ప్ర‌ధాని, కేంద్ర‌మంత్రుల‌ను సైతం వ‌ద‌ల‌కుండా తిడ‌తామ‌న్నారు. బీజేపీ నేత‌లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడాల‌ని వార్నింగ్ ఇచ్చారు. కిష‌న్ రెడ్డి ఒక్క‌రు కొంచెం హుందాగా మాట్లాడుతున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

బీజేపీ సొసైటీలో త‌క్కువ సోష‌ల్ మీడియాలో ఎక్కువ ఉంటుంద‌ని, గోబెల్స్‌కే పాఠాలు నేర్పే స్థాయికి ఆ పార్టీ నేత‌లు వెళ్లార‌ని, నోటికి వ‌చ్చిన అబ‌ద్ధాలు ఆడుతున్నార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. బండి సంజ‌య్‌కు ముఖ్య‌మంత్రి స్థాయి ఉందా అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. చ‌ర్చ‌కు రావాల‌ని హ‌రీష్ రావు స‌వాల్ చేస్తే బండి సంజ‌య్ రాలేద‌ని, దుబ్బాక‌కు బీజేపీ ఏం చేసిందో శ్వేతప‌త్రం విడుద‌ల చేయాల‌ని కేటీఆర్ బీజేపీ నేత‌ల‌కు స‌వాల్ చేశారు.

రాష్ట్రం నుంచి న‌లుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా ఒక్క రూపాయి కూడా అద‌నంగా నిధులు తీసుకురాలేద‌ని కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌కు వ‌ర‌ద‌లు వ‌స్తే ఇంత‌వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా కేంద్రం సాయం చేయలేద‌ని కేటీఆర్ ఆరోపించారు. దుబ్బాక త‌మ సీటు అని, త‌మ సీటును మ‌ళ్లీ తామే గెలుచుకుంటామ‌ని, గ‌తంలో కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటామ‌ని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

Related News