logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

సీఎంగా కేటీఆర్.. క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ మనవడు!

కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు ఈ మధ్యకాలంలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అందుకు సంబందించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని సమాచారం. ఇటీవల సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన కూడా అందుకోసమే అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి.

ఇప్పటికే ఈ విషయంపై టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. సీఎం గా కేటీఆర్ ఉండాలని పార్టీ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కేసీఆర్ మనవడు హిమన్షు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ వాట్ యు ఫీల్ లైక్’ అనే అనే ట్యాగ్ లైన్ తో లైవ్ లోకి వచ్చిన హిమాన్షు నెటిజన్లతో ముచ్చటించాడు.

ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అందులో భాగంగా ఒకరు.. ‘కేసీఆర్ కేటీఆర్ లాగానే మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారా?’ అని అడగగా తనకు రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేసాడు. ఇక తన తండ్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని వస్తున్న వార్తలపై ఓ నెటిజన్ హిమాన్షును అడగగా అందుకు తెలివిగా సమాధానం ఇచ్చాడు. ఇంట్లో ఉన్న సమయంలో తండ్రి, తాత రాజకీయాల గురించి చర్చించుకోరని తేల్చి చెప్పాడు.

Related News