logo

వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు

ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్ట‌డ‌మే వంద‌ల ఎక‌రాల భూములు ఉన్న కుటుంబంలో పుట్టార‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొంద‌రు ఆయ‌న‌ను ఫామ్‌హౌజ్ ముఖ్య‌మంత్రి అంటున్నార‌ని, వ్య‌వ‌సాయ భూమిలో ఇల్లు క‌ట్టుకోవ‌డం త‌ప్పా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండ‌లం కోనాపూర్ గ్రామంలో కేటీఆర్ ప‌ర్య‌టించారు. ఇది కేసీఆర్ పూర్వీకుల గ్రామం. ఈ గ్రామంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. త‌న నాన‌మ్మ జ్ఞాప‌కార్థం ఈ గ్రామంలో సొంత ఖ‌ర్చుతో పాఠ‌శాల భ‌వ‌నాన్ని నిర్మిస్తాన‌ని హామీ ఇచ్చారు.

Related News