logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

భార్య ప్రియుడితో ఉందని గదికి తాళం వేసిన పోలీస్.. అక్కను చూసి ఖంగుతిన్నాడు

భార్యపై తీవ్ర అనుమానం పెంచుకున్న పోలీస్ కానిస్టేబుల్ ఎలాగైనా ఆమె బాగోతం బయటపెట్టాలనుకున్నాడు. ప్రియుడితో భార్య లోపల ఉందని భావించి బయట నుంచి తాళం వేసాడు. ఈలోగా మీడియా మిత్రులను, పోలీసులను, ఊరివాళ్ళందరిని పిలిపించాడు. కానీ చివరకు గదిలో నుంచి బయటకొచ్చిన అక్కను చూసి ఖంగు తిన్నాడు. ఈ విచిత్ర ఘటన కృష్ణా జిల్లాలోని మైలవరంలో జరిగింది.

భార్య స్థానికంగా ఓ రాజకీయా వేత్తతో ఎఫైర్ నడుపుతుందని అనుమానం పెంచుకున్నాడు. ఆ రాజకీయనాయకుడు ఇటీవల గ్రామ శివార్లలో ఓ ఇల్లు కొన్నాడని అక్కడే తన భార్యను రహస్యంగా కలుస్తున్నాడని నిర్దారించుకున్నాడు. ఇటీవల తన భార్య ఆ ఇంటికి వెళ్లినట్టు తెలుసుకున్నాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించాలని ప్లాన్ వేసాడు.

ఆ గదికి బయట నుంచి తాళం వేసి పైన చెప్పుకున్న విధంగా అందరికీ ఫోన్లు చేసి పిలిపించాడు. ఇంకేముంది చివరగా తాళం తీసి చూడగా గదిలో నుంచి తన భార్య కు బదులు ఆమె అక్క బయటకు రావడం చూసి ఖంగు తిన్నాడు. తన చెల్లెలి భర్త అయిన కానిస్టేబుల్ చేసిన పనికి బూతులు తిడుతూ ఆమె అక్కడి నుంచి జారుకుంది. తన తోడల్లుడు ఉద్యోగరీత్యా ఊర్లో ఉండడని తనతో పాటు తన తోడల్లుడు కుటుంబంలో కూడా ఆ రాజకీయనేత చిచ్చు పెడుతున్నాడని ఆరోపించాడు. అయితే ఆ రాజకీయ నాయకుడిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

Related News