logo

  BREAKING NEWS

గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |  

రవితేజ ఆశలపై నీళ్లు చల్లిన నిర్మాత.. ఆగిపోయిన ‘క్రాక్’ విడుదల!

కొత్త సంవత్సరం సంక్రాంతి బరిలోకి దిగిన ఏకైన పెద్ద సినిమా ‘క్రాక్’. గోపీచంద్ మలినేని- రవితేజ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వరుస డిజాస్టర్లతో రవితేజ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతున్న సమయంలో డాన్ శీను, బలుపు లాంటి సినిమాలతో దర్శకుడు గోపీచంద్ మలినేని మర్చిపోలేని విజయాలను అందించాడు. రవితేజ కెరీర్ లో ఇప్పుడు మళ్ళీ అలాంటి రోజులే వచ్చాయి.

దీంతో మరోసారి ఈ యంగ్ దర్శకుడు క్రాక్ సినిమాతో రంగంలోకి దిగాడు. క్రాక్ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన విడుదల కావలసి ఉండగా హఠాత్తుగా ఈ సినిమా మార్నింగ్ షోను రద్దు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం సినిమా నిర్మాత ఠాగూర్ మధు అని తెలుస్తుంది. నిర్మాతకు గత సినిమాల విషయంలో ఉన్న అప్పుల కారణంగా క్రాక్ సినిమాకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభించలేదు.

ఆ భారం అంతా ఈ సినిమాపై పడింది. చివరి నిమిషం వరకు నిర్మాత ఫైనాన్షియల్ క్లియరెన్స్ పై దృష్టి పెట్టకపోవడంతో ఇప్పుడు షోను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఠాగూర్ మధు చెన్నైలో ఉన్నట్టు సమాచారం. అక్కడ ఫైనాన్షియల్ సెటిల్ మెంట్స్ పూర్తి కాగానే సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవుతుందని సమాచారం.

ఈ సినిమా రవి తేజకే కాకుండా హీరోయిన్ శృతి హాసన్ కు కూడా చాలా కీలకం. నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో శృతి టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇక మరో కీలక పాత్రలో రాధికా శరత్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Related News