logo

  BREAKING NEWS

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త!  |   అయోధ్య మసీదుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!  |   మహారాష్ట్ర – కర్ణాటకకు మధ్య ఏమిటీ ‘బెల్గాం’ వివాదం?  |   తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక ? ఆ ఎమ్మెల్యే రాజీనామా ఖాయం..?  |   మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి చిరంజీవి..? త‌మ్ముడి వెంట అన్న..?  |   బైడెన్ సంచలన నిర్ణయం.. ప్రవాస భారతీయులకు భారీ ఊరట!  |   పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |  

కొత్త సంవత్సరం రోజున కాంగ్రెస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎమ్మెల్యే!

కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడతారంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన సొంత పార్టీకి షాకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. శుక్రవారం ఉదయం కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా తాను త్వరలోనే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరతానంటూ ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడుతుందని మొదట చెప్పిన వ్యక్తిని తానేనన్నారు. రాబోయే రోజుల్లో తాను బీజేపీలో చేరతానన్నారు. అయితే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతారని స్పష్టం చేసారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పీసీసి పదవికి పోటీ నడుస్తున్న విషయం తెలిసిందే. పీసీసీ రేసులో రేవంత్ రెడ్డితో పాటుగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోటీ సీనియర్ నేతల్లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా ఇటీవల కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడం వెంటనే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతానని ప్రకటించడం గమనార్హం.

Related News