logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

ఢిల్లీకి కోమటిరెడ్డి.. పీసీసీ చీఫ్ పదవి రేసులో ఆ ఇద్దరి పేర్లు!

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 23 లేదా 26 తేదీల్లో పార్టీ అధిష్టానం పీసీసీ చీఫ్ అభ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ పదవి ఫైనల్ అయ్యిందనే వార్తలు వస్తున్న వేళ భువనగిరి ఎంపీ కోమటి రెడ్డివెంకట్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా ఇదే విషయమై భేటీ అయిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ముగ్గురి పేర్లను పరిశీలించిన హై కమాండ్ ఫైనల్ లిస్టులో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఉంచినట్టు సమాచారం. అభిప్రాయ సేకరణలో సైతం రేవంత్ కె ఎక్కువగా మద్దతు లభించినట్టు తెలుస్తుంది. పార్టీ అధిష్టానం కూడా ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ ఉండి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉంది.

దీంతో చివరి ప్రయత్నంగా కోమటి రెడ్డి ఢిల్లీ పెద్దలను కలసి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి ఎప్పుడో రాజీనామా చేసినా ఆ పదవికి పోటీ అధికంగా ఉండటం, మరి కొన్ని ఇతర కారణాల వల్ల అంశంపై ఏఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీనియర్ల కోణంలో కోమటి రెడ్డి, బట్టి పేర్లను అధిష్టానం పరిశీలనలో ఉంచింది.

లాక్ డౌన్ తర్వాత దాదాపు ఈ పదవికి కోమటి రెడ్డి పేరునే ప్రకటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి అధికార పార్టీతో దూకుడుగా వ్యవహరించడం అధిష్టానంతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో ఇప్పుడు పీసీసీ పదవికి రేసులో రేవంత్ నుంచి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ హై కమాండ్ ఎవరి పేరు ప్రకటిస్తుందనే విషయం ఉత్కంఠగా మారింది.

Related News