logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

నమ్మి వెళితే అఘాయిత్యం.. హైదరాబాద్ మాహిళ రేప్ కేసులో సంచలన విషయాలు!

హైదరాబాద్ లో అత్యాచారం, హత్యకు గురైన మహిళ రేప్ కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ముందుగా మహిళకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన నిందితులు ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మహిళను హత్య చేసినట్టుగా గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు యువకులను గుర్తించి అరెస్టు చేసినట్టుగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

మృతురాలు ప్రేమలతకు నిందితుడు మధు నాయక్ తో ఉన్న పరిచయం కారణంగా అతను పిలిస్తే వెళ్ళింది. ఆమెకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిన మధు నాయక్ పథకం ప్రకారం అక్కడకు వెళ్లిన తర్వాత మరో ఇద్దరు యువకులను పిలిచి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ సమయంలో ప్రేమలత తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టుగా పోలీసులు వెల్లడించారు. మధు నాయక్ తో ఉన్న పరిచయం కారణంగానే అతని మాటలు నమ్మి వెళ్లినందుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Related News