ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఏపీ మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటైన విమర్శలు చేసారు. ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏపీ మంత్రులపై చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా గుడ్లవలేరు మండలం కౌతువరం గ్రామంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కొడాలి నాని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కొడాలి నాని మాట్లాడుతూ.. నన్ను, పేర్ని నానికి బోడి లింగం అంటూ కామెంట్లు చేస్తున్న పవన్ కల్యాణే పెద్ద బోడి లింగం. అందుకే గాజువాక, భీమవరం ప్రజలు కిందపడేసి తొక్కారు. మేము శివలింగాలం కాబట్టే మచిలీపట్టణం, గుడివాడ ప్రజలు మమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు అంటూ కౌంటర్ అట్టాక్ చేసారు.
ప్యాకేజీలు తీసుకుని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్లను ప్రజలు నమ్మరన్నారు. ప్రజల తిరస్కారానికి గురైన పవన్ కళ్యాణ్ ఇంకా సిగ్గు, శరం లేకుండా మాట్లాడటం ఆయన అవివేకమన్నారు. అయినా పవన్ కళ్యాణ్ ను సినిమాలు మానేయాలని ఎవరైనా అడిగారా? నువ్వు సినిమాలు చేస్తే ఎంత చేయకపోతే ఎంత. పవన్ కళ్యాణ్ తన యాక్షన్ ను సినిమాల్లో చూపించాలి.
పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టం అన్నారు. జగన్ పై దేవుడి ఆశీస్సులు ఉన్నంత కాలం గజదొంగ లాంటి చంద్రబాబు, బోడి లింగం లాంటి పవన్ కళ్యాణ్ లు ఎంత మంది వచ్చినా ఆయన బొచ్చు కూడా పీకలేరు అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు నాని. ఇప్పుడు వీరిద్దరి మధ్య మాటల వార్ హాట్ టాపిక్ గా మారింది.