ఏపీ మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్ఈసీపై తనకెంతో గౌరవముందని తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకమైనవి కాదని నాని ఇచ్చిన వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఎస్ ఈసీ ఈ నిర్ణయం తీసుకొవడం సంచలనంగా మారింది. కొడాలి నాని వివరణపై తాను సంతృప్తి చెందలేదని నిమ్మగడ్డ నోటీసులలో పేర్కొన్నారు.
తాజాగా ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి కొడాలినాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఈసీ ఆదేశాలపై మంత్రి హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఎస్ఈసీపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా కేసులు నమోదు చేయడం, ఆంక్షలు విధించడంపై మంత్రి కొడాలినాని ఫైర్ అయ్యారు.