logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌

తెలుగుదేశం పార్టీ, జూనియ‌ర్ ఎన్టీఆర్‌పైన మంత్రి కొడాలి నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీకి భ‌విష్య‌త్తు లేద‌ని, ఆ పార్టీ ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ లాంటిద‌ని ఎద్దేవా చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌చ్చినా, ఇంకా ఎవ‌రు వ‌చ్చినా టీడీపీని కాపాడ‌లేర‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో టీడీపీ లేకుండా తుడిచిపెట్టుకొని పోయింద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో నామ‌మాత్రంగానే ఆ పార్టీ పోటీ ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

చంద్ర‌బాబు నాయుడు జూమ్‌లో సొల్లు క‌బుర్లు చెప్ప‌డానికే పరిమితం అయ్యాడ‌ని అన్నారు. క‌రోనా భ‌యంతో ఆయ‌న నాలుగు గోడ‌ల మ‌ధ్య‌నే ఉండిపోతార‌ని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్ర‌బాబును తాము చేస్తున్న విమ‌ర్శ‌లు కొత్తేమీ కాద‌ని, దివంగ‌త ఎన్టీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌నే తాము చేస్తున్నామ‌ని నాని పేర్కొన్నారు. తాను టీడీపీలో ఉన్న‌ప్పుడు కూడా హ‌రికృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి న‌డిచాన‌ని, 2009లో ఓట‌మి త‌ర్వాత వారిని చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టాక ఇక తాను చంద్ర‌బాబు లాంటి వారితో ఉండ‌వ‌ద్ద‌నే వైసీపీలో చేరాన‌ని పేర్కొన్నారు.

మూడు రాజ‌ధానుల ఏర్పాటు వ‌ల్ల త‌మ‌కు, త‌మ గుడివాడ‌ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ఇబ్బంది లేద‌ని నాని పేర్కొన్నారు. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం వ‌ల్ల రాష్ట్రానికి క‌లిగిన ప్ర‌యోజ‌నాల గురించి ప‌దేళ్ల త‌ర్వాత అంద‌రికీ తెలుస్తుంద‌ని అన్నారు. అమ‌రావ‌తి రైతుల‌ను చ‌ర్చ‌ల‌కు పిలిచినా రావ‌డం లేద‌ని పేర్కొన్నారు.

Related News