logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

చంద్రబాబుపై కొడాలి నాని సంచలన ఆరోపణలు.. హీరో రామ్ కు సలహా!

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు. ఏ తప్పు చేయకుంటే ఆసుపత్రి యజమాని డాక్టర్ రమేష్ ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. మహిళలను ముందు పెట్టి రమేష్ తప్పించుకునే ప్రయత్నం దారుణమని పేర్కొన్నారు.

ఈ ఆసుపత్రి వెనుక బడా నేతల హస్తం ఉందని, నిందితులను రక్షించేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. డాక్టర్ రమేష్ ఎక్కడో లేదని చంద్రబాబు ఇంట్లోనే తలదాచుకున్నాడని, ఈ విషయం అందరికి తెలుసంటూ సంచలన ఆరోపణలు చేసారు. చంద్రబాబు ఎంత కాపలా కాసినా నిందితులను తమ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. కమ్మ సామజిక వర్గంపై తమ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చేస్తున్న ఆరోపణలను కొడాలి నాని ఖండించారు.

కులాల ప్రస్తావన లేకుండా బాబు మాట్లాడలేరా? అంటూ మండిపడ్డారు. ఏ ఒక్క సామజిక వర్గాన్ని టార్గెట్ చేయవలసిన అవసరం జగన్ కు లేదన్నారు. ఇక ఈ వ్యవహారంలో హీరో రామ్ చంద్రబాబు మాటలు వినకపోవడమే మంచిదన్నారు. గతంలో ఎంతో మంది సినీ నటులను బాబు తన అవసరాల కోసం వాడుకుని వదిలేసారు. ఆయన మాటలు వింటే వారికి వచ్చిన పరిస్థితే వస్తుందని సలహా ఇచ్చారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న డాక్టర్ రమేష్ కు హీరో రామ్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

Related News