logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

బాబు, లోకేష్ లకు ఆ పరీక్షలు చేయించాలి: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!

నారా లోకేష్, చంద్రబాబులపై వైసీపీ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ఘటనపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబు అనుచరులు ఆలయానికి వెళ్లారంటే ఆలయ విగ్రహాలు ధ్వంసం చేయించింది వందశాతం చంద్రబాబే అన్నారు. నిజాలు బయటకు రావాలంటే చంద్రబాబు, లోకేష్ లకు వారి అనుచరులకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలన్నారు.

దేవుడి లాంటి ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, దేవుడన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఒక లుచ్చా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు రామతీర్థంలో డేరాబాబా అవతారం ఎత్తారన్నారు. రాజకీయాల కోసం దేవుళ్లను అడ్డుపెట్టుకుని నీచ స్థితికి బాబు దిగజారారన్నారు.

ఇక వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ సీఎం జగన్ కు సవాలు విసరడం ఏమిటని ఎద్దేవా చేసారు. దొడ్డిదారిన మూడు పదవులు వెలగబెట్టిన లోకేష్ జగన్ నిలబెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయాడని అలాంటి వ్యక్తి సవాలును జగన్ స్వీకరించాలనడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పిచ్చివాగుడు కట్టిపెట్టాలని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే సహించేది లేదంటూ కొడాలి నాని హెచ్చరించారు.

Related News