ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. సభలో సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇరు పక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. గతంలో ఏపీ ప్రభుత్వం రూ. 3 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిందన్నారు. ఇప్పుడు ఏమైందని బాబు ప్రశ్నించారు. అందుకు మంత్రి కొడాలి నాని సమాధానం ఇచ్చారు.
9 ఏళ్ల పాటు టీడీపీ హయాంలో మీరెంత ఇచ్చారో మాకు తెలుసు. చంద్రబాబు ప్రభుత్వం పేదవారికి ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెంచలేదన్నారు. ముందు మీరు చేసిన తప్పులు సరిదిద్దికోవాలని కోడలి నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ అందిస్తుందన్నారు.
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. చంద్రబాబు అనేక సమయాల్లో పారిపోయారన్నారు. 1983లో ఓడిపోగానే కాంగ్రెస్ ను వదిలి పారిపోయారని, మరోసారి చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయారని, ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ వదిలి పారిపోయారని, కరోనా రాగానే కాల్వగట్టు వదిలి హైదరాబాద్ కు పారిపోయారని అన్నారు. చంద్రబాబును ఫక్ ప్రతిపక్ష నేత అని, ఫక్ తెలుగుదేశం పార్టీ అని విరుచుకుపడ్డారు.