logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!

గేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. తాజాగా బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీ ఆర్ ఎస్ పార్టీ నిలబెట్టుకోలేదన్నారు. 2016 లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ప్రజలు కేసీఆర్ ను గెలిపించారు. ఐజిహెచ్ కాలనీలో కట్టిన ఇళ్లను చూపించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తే అందరికీ ఇలాంటి ఇల్లే ఇస్తామన్నారు. వాటిని చూసి పేద ప్రజలు మోసపోయారన్నారు.

మరి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారా? అని కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలు ఆ విషయాన్ని నిలదీయాలన్నారు. రోడ్ల మీద గుంతలు చూపిస్తే రూ. వెయ్యి ఇస్తామని కేసీఆర్ ఆనాడు సవాల్ చేసారు. ఇప్పుడు గుంత లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష ఇస్తానని ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. నగరంలో వర్షం పడితే ప్రధాన రోడ్లన్నీ వరదమయంగా మారిపోతున్నాయి. హైదరాబాద్ ను మహాసముద్రంగా మార్చారు. అందుకు కారణం ఈ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

వరదల కారణంగా 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మొదలైన మెట్రో పనులను తమ ఖాతాలో వేసుకున్నారు. 2014 లో హైదరాబాద్ ను డల్లాస్ లా, ఇస్తాంబుల్ లా మారుస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. కనీసం నాళాల్లో పూడికతీత కూడా తీయడం లేదు. జీహెచ్ఎంసీ నిధులను దుబారాగా ఖర్చు చేసి అప్పులపాలు చేసారు. హైదరాబాద్ కు బీజేపీకి విడదీయలేని అనుబంధం ఉంది. ప్రజలకు ఎపుడు కష్టం వచ్చినా బీజేపీ అండగా నిలిచింది. ఈ ఎన్నికల్లో కూడా ప్రజల అశీసులు కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related News