logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

చైనాను నమ్మి కిమ్ అంత రిస్క్ చేశాడా..?

కరోనా అంటే భయపడే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎట్టకేలకు ఆ మహమ్మారి నుంచి తప్పించుకోనున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆయన కుటుంబం కరోనా వాక్సిన్ వేయించుకున్నారు. దీంతో కిమ్ కు కరోనా ముప్పు తప్పింది. వాషింగ్టన్ లోని సెంటర్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

కిమ్ వారి కుటుంబం తో పాటుగా ఇతర ముఖ్య అధికారులకు కూడా మూడు వారాల క్రితం వాక్సిన్ వేయించారని ఈ సంస్థ పేర్కొంది. కిమ్ వేసుకున్నది చైనా టీకా అని తెలిపారు. కానీ టీకా పేరు మాత్రం వెల్లడించలేదు. ఇప్పటి వరకు చైనాలో తయారైనా ఏ టీకా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కానీ, ఇతర నియంత్రణ సంస్థల నుంచి కానీ అధికారికంగా ఆమోదం పొందలేదు. అయితే ట్రయల్స్ లో భాగంగానే కిమ్ ఈ చైనా టీకా తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

అయితే డ్రాగన్ దేశాన్ని నమ్మి కిమ్ ఇంత రిస్క్ చేయడం విశేషం. మరి కిమ్ వేసుకున్న టీకా ఏది? అది ఎంతవరకు సురక్షితం? అనే విషయం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తమ దేశంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదని కిమ్ ప్రభుత్వం చెప్తున విషయం తెలిసిందే. కానీ వాటికి ఎలాంటి ఆధారాలు లేవు.

 

Related News