logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కిమ్ తప్పు తెలుసుకున్నాడు.. మరో సంచలన నిర్ణయం!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చనిపోయాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. ఉత్తర కొరియా నిర్మాత, ఆ దేశాన్ని పాలించిన మొదటి వ్యక్తి కిమ్ తాత కిమ్ 2 సంగ్. కొరియా రెండు భాగాలుగా విభజించబడిన తర్వాత ఆ దేశానికి నాయకత్వం వహించిన మొదటి వ్యక్తి ఇతను. ఇతన్ని ఆ దేశ ప్రజలు దేవుడి రూపంగా భావిస్తారు. అతను ఇంకా బతికే ఉన్నాడని కొందరు ప్రజలు ఇప్పటికీ బలంగా నమ్ముతారంటే అయన ప్రభావం ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

అతని తర్వాత కిమ్ తండ్రి, ఇప్పుడు కిమ్ ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. అయితే ఆ దేశ నిర్మాతగా భావించే తన తాత జయంతికి కిమ్ హాజరు కాలేదు. ఆ దేశ చరిత్రలో ఏ పాలకుడూ ఈ విధంగా చేయలేదు. దీంతో కిమ్ మరణించాడని అందుకే ఎప్పుడూ లేని విధంగా ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి హాజరు కాలేదని అనుమానాలు వ్యక్తం చేసారు. ఈ వార్తల ప్రభావం ఆ దేశంపై భారీగానే పడింది. దీంతో కిమ్ ఇప్పుడు తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు.

నిన్నటి రోజున తన తాత గారి వర్థంతిని కిమ్ ప్రభుత్వం అంగ రంగ వైభవంగా జరిపించింది. ప్రతి ఒక్కరు కూడా నల్లని డ్రెస్ లో ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమానికి హాజరైన ఏ ఒక్కరు మాస్కు ధరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వేడుకల సందర్భంగా కిమ్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. తమ దేశంలోని సైనికులు ప్రతి ఒక్కరు తమ ఇంట్లో దాదాపు 15 కుందేళ్ళను పెంచాలని ఆదేశించాడు.

తమ దేశం పోష్టికాహార లోపం బారిన పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే కిమ్ నిర్ణయాన్ని ఏ ఒక్కరు పాటించకపోయినా, ఆకస్మిక తనికీల్లో లెక్క తక్కువగా వచ్చినా కఠిన శిక్షలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల కరోనా ను అరికట్టడంలో సక్సెస్ అయ్యామని కిమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశంలో కరోనా కేసుల లెక్క బయటకు తెలియనప్పటికీ ప్రజలకు కఠిన నిబంధనలు విధించడం వల్ల అక్కడ 1000 లోపే కేసులు నమోదయ్యాయని సమాచారం.

Related News