logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

కిడ్నీల్లో రాళ్లు ఎందుకు వస్తాయి? లక్షణాలు ఏమిటి? ఆపరేషన్ ఎవరికి అవసరం?

వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య కిడ్నీ లో రాళ్లు ఏర్పడటం. ఈ సమస్య ఉన్నవారిలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి భరించడం చాలా కష్టం. 20 నుంచి 30 ఏళ్ల వయసు నుంచి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. విటమిన్ డీ లోపం, నీళ్లు తక్కువగా తాగేవారు, సమయానికి ఆహారం తీసుకొని వారిలో కిడ్నీ లో రాళ్లు ఏర్పడతాయి.
ఇవే కాకుండా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి చాలానే కారణాలు ఉన్నాయి. స్త్రీలలో కన్నా పురుషుల్లో ఈ ప్రమాదం ఎక్కువ.

శరీరంలో జీవ క్రియ తర్వాత వెలువడే వ్యర్థాలు, విష పదార్థాలను రక్తంలో కలవకుండా వేరు చేసి బయటకు పంపే కీలకమైన పాత్రను మూత్రపిండాలు నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలో క్యాల్షియమ్ ఆక్సలేట్, సిస్టిన్ వంటివి స్ఫటికాలుగా మారిపోతూ ఉంటాయి. కిడ్నీల్లో కొన్ని పదార్థాలు పేరుకుపోయి స్పటిక ఆకారాన్ని సంతరించుకుంటాయి. సాధారణంగా చిన్న చిన్న రాళ్లుగా ఏర్పడిన తర్వాత కూడా అవి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. కానీ వాటి సైజు 5 మిల్లి మీటర్ల కంటే ఎక్కువ పెరిగితే అవి మూత్రంలో బయటకు రాలేక నొప్పిని కలుగజేస్తాయి. చాక్లెట్లు అధికంగా తిన్నా, వేసవిలో ఏసీ గదుల్లో ఎక్కువ సేపు గడిపినా కూడా ఈ సమస్య ఎపడుతుంది. ఈ రాళ్ల నివారణ, చికిత్సలు ఏమిటో తెలుసుకుందాం..

లక్షణాలు:
కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని తెలిపే కొన్ని లక్షణాలను శరీరం మనకు ముందుగానే చూపుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో వీపు కింద భాగంలో తీవ్రమైన నొప్పి మొదలయ్యి ఆ నొప్పి పొత్తికడుపు, వృషణాలు, జననేంద్రియాల వరకు వ్యాపిస్తుంది. మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, మంట కలుగుతుంది. కొన్ని సార్లు మూత్రంలో రక్తం కలిసి వస్తుంది. ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.

పరీక్షలు:
కిడ్నీల్లో రాళ్లను నిర్ధరించేందుకు మూత్ర పరీక్ష, అల్ట్రాసౌండ్, ఇంట్రావీనస్ యురోగ్రఫీ, ఎక్స్ రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలతో నిర్దారిస్తారు.

చికిత్సలు:
కిడ్నీల్లో ఏర్పడే రాళ్లు కొన్ని సార్లు ఆపరేషన్ అవసరం లేకుండా వాటంతట అవే తొలగిపోతాయి. రాయి సైజును బట్టి అవి తొలగిపోని క్రమంలో వైద్యులు కొన్ని చికిత్సలను ఉపయోగిస్తారు. ఎండోస్కోపీ ద్వారా వీటిని తొలగిస్తారు. రోగి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, కిడ్నీలు విఫలమైనప్పుడు, సర్జరీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆపరేషన్ ఇష్టపడని వారు నెల రోజుల పాటు వేచి చూసి అప్పటికీ ఈ సమస్య తగ్గకుంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్ని సార్లు శస్త్ర చికిత్స అవసరం లేకుండా లేజర్ థెరపీ ద్వారా రాళ్లను కరిగిస్తారు.

జాగ్రత్తలు:
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే ఇవి దీర్ఘకాలిక వ్యాధులను దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా ముందుగానే ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు. అందుకోసం వీలైనన్ని ఎక్కువ సార్లు నీటిని తాగాలి. ప్రతి రోజు రెండున్నర లీటర్ల మూత్రాన్ని విసర్జించాలి. అంటే 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్, నైట్రోజెన్, సోడియం ఉన్న పదార్థాలన తక్కువ మోతాదులో ఉండేట్టుగా చూసుకోవాలి. ఆగ్సలేట్ అధికంగా ఉండే గింజలను సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని కూడా వీలైనంత వరకు తగ్గించాలి. పొటాషియం సిట్రేట్ కలిగిన ఆహార పదార్థాలు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే గుణం ఉంది. కాబట్టి ఆహారంలో వీటిని వైద్యుల సూచనల మేరకు చేర్చుకోవాలి. అతిగా ఆల్కహాల్ సేవించేవారు ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చేయవలసి ఉంటుంది. అందువల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడి కిడ్నీ స్టోన్స్ కు దారి తీసే అవకాశముంది.

 

 

Related News