logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు

మ‌హ‌బూబాబాద్‌లో ఆదివారం రాత్రి కిడ్నాపైన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డిని కిడ్నాప‌ర్లు పొట్ట‌న‌పెట్టుకున్నారు. తమ‌ కుమారుడిని విడిచిపెట్టాల‌ని త‌ల్లిదండ్రులు ఎంత బ‌తిమిలాడినా కిడ్నాప‌ర్ల మ‌న‌స్సు క‌ర‌గలేదు. కిడ్నాపర్లు అడిగిన‌‌ డ‌బ్బులు సిద్ధం చేసి, ఇచ్చేందుకు వెళ్లినా త‌ల్లిదండ్రుల‌కు దీక్షిత్ మిగ‌ల‌లేదు. మాన‌వ‌త్వం అనేది మ‌చ్చుకైనా లేని కిడ్నాప‌ర్లు దీక్షిత్‌ను దారుణంగా హ‌త్య చేశారు.

మ‌హ‌బూబాబాద్ కృష్ణ కాల‌నీలో నివాస‌ముండే రంజీత్‌, వ‌సంత కుమారుడు దీక్షిత్ రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటుండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ద్వీచ‌క్ర వాహ‌నంపై వ‌చ్చి కిడ్నాప్ చేశారు. బాలుడిని విడిచిపెట్టాలంటే రూ.45 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని దీక్షిత్ త‌ల్లిదండ్రుల‌ను కిడ్నాప‌ర్లు డిమాండ్ చేశారు. త‌న ఆస్తులు అన్నీ అమ్మి కోటి రూపాయ‌లైనా ఇస్తాన‌ని, త‌న కుమారుడిని త‌మ‌కు అప్ప‌గించాల‌ని బాలుడి త‌ల్లి కిడ్నాప‌ర్ల‌ను వేడుకుంది.

కిడ్నాప‌ర్లు ఇంట‌ర్నెట్ కాల్స్ చేసి త‌ల్లిదండ్రుల‌ను బెదిరించారు. దీంతో నిన్న రాత్రి కిడ్నాప‌ర్లు అడిగిన రూ.45 ల‌క్ష‌లు తీసుకొని బాలుడి తండ్రి కిడ్నాప‌ర్లు చెప్పిన అన్ని చోట్ల‌కు తిరిగి రాత్రంతా వేచి చూశారు. కానీ, కిడ్నాప‌ర్లు వ‌చ్చి డ‌బ్బు తీసుకోవ‌డానికి రాలేదు. ఇవాళ కేస‌ముద్రం మండ‌లం అన్నారం గుట్ట‌లో కుల్లిపోయిన స్థితిలో బాలుడి మృత‌దేహం ల‌భించింది.

బాలుడిని పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. మృత‌దేహం కుల్లిపోయిన స్థితిలో ఉండ‌టంతో కిడ్నాపైన రోజే బాలుడిని హ‌త్య చేసి ఉంటార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బాలుడి మ‌ర‌ణ‌వార్త విని త‌ల్లిదండ్రులు గుండె‌ల‌విసేలా రోధిస్తున్నారు. కిడ్నాప‌ర్లుగా భావిస్తున్న మ‌నోజ్‌, మంద సాగ‌ర్‌, తాటిపాముల అనిల్ అనే నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Related News