logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కియా.. జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఊర‌ట‌‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రిన్ని పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని కియా సంస్థ ప్ర‌క‌టించింది. మ‌రో 54 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి అద‌నంగా పెడ‌తామ‌ని కియా సంస్థ సీఈఓ కూకున్‌షిమ్‌ చెప్పారు. గురువారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న మ‌న పాల‌న – మీ సూచ‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న ఈ మేర‌కు తాము ఏపీలో కొత్త‌గా ఎస్‌యూవీ కార్ల‌ను త‌యారు చేయాల‌నుకుంటున్నామ‌ని, ఇందుకు గానూ మ‌రో 54 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని తెలిపారు.

కాగా, కియా సంస్థ విష‌యంలో గ‌తంలో పెద్ద రాజ‌కీయ ర‌గ‌డ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అనంత‌పురంలో తెలుగుదేశం పార్టీ హ‌యాంలో ప్రారంభ‌మైన కియా సంస్థ త‌మిళ‌నాడుకు వెళ్లిపోతోంది అని వ‌చ్చిన ఓ వార్త ఆధారంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేసింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేత‌గానిత‌నం వ‌ల్ల‌, వైసీపీ నేత‌ల బెదిరింపుల వ‌ల్ల‌నే కియా వంటి గొప్ప సంస్థ ఏపీ నుంచి వెళ్లిపోతోంద‌ని అని టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేశారు.

ఒక్క‌సారిగా మొదలైన ఈ ప్ర‌చారంతో వైసీపీ ప్ర‌భుత్వం అప్ప‌ట్లో బాగా ఇబ్బంది ప‌డింది. కియా ఎక్క‌డ‌కూ వెళ్ల‌ద‌ని, త‌మ ప్ర‌భుత్వం కియా సంస్థ‌కు అన్నిర‌కాలుగా తోడ్పాటు అందిస్తుంద‌ని మంత్రులు చెప్పారు. ఆఖ‌రికి కియా ప్ర‌తినిధులు కూడా తమ‌కు ఏపీ నుంచి వెళ్లాల‌నే ఆలోచ‌న లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక‌, ఇప్పుడు ఏపీలోనే మ‌రిన్ని పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని కియా చెప్ప‌డం జ‌గ‌న్ స‌ర్కార్‌కు కొంత ఊర‌ట క‌లిగించే అంశం.

Related News