logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న రేసులో ఆ ఐదుగురు..

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు అత్యున్నత గౌరవం లభించనుంది. క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత ఖేల్ రత్న పురస్కారానికి క్రీడాకారులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించిన సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మతో పాటుగా మరో నలుగురి పేర్లను సిఫారసు చేసింది. వీరిలో రెజ్లర్ వినేష్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మణిక బాత్ర, పారా ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు కూడా ఉన్నారు.

సెల‌క్ష‌న్ క‌మిటీ సభ్యులుగా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, హాకీ దిగ్గజం సర్దార్ సింగ్ ఉన్నారు. కాగా 2016 తర్వాత నలుగురు అథ్లెట్ల పేర్లను ఖేల్ రత్న అవార్డుకు సిఫార్సు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటివరకు భారత క్రికెట్‌లో ఖేల్ రత్న అందుకున్న ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలు మాత్రమే ఉన్నారు.

ఇప్పుడు రోహిత్ శర్మ ఈ అవార్డు అందుకుంటే వీరి తర్వాత అత్యున్నత పురస్కారం అందుకున్న నాలుగో ఆటగాడిగా నిలవనున్నాడు. కాగా భారత్ తరపున మూడు డబల్ సెంచెరీస్ చేసిన మొట్టమొదటి ఆటగాడు. భారత్ తరపున మూడు డబల్ సెంచరీలు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు.

Related News