logo

  BREAKING NEWS

బిగ్ బ్రేకింగ్‌: టీడీపీకి భారీ షాక్‌.. ఎల్లుండి వైసీపీలోకి కీల‌క నేత‌..?

తెలుగుదేశం పార్టీ ప్ర‌తిప‌క్ష హోదాకు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి. ఆ పార్టీ నుంచి మ‌రో ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్ట‌డానికి ముహూర్తం ఖ‌రారైంది. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో టీడీపీ కీల‌క నేత‌గా ఉన్న మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు ఎల్లుండి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు రంగం సిద్ధ‌మైంది. ఆయ‌న‌తో పాటు ఆయ‌న కుమారుడు ర‌వితేజ కూడా జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నున్నట్లు తెలుస్తోంది.

కుమారుడు గంటా ర‌వితేజ‌ను అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చి తాను జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌నే ఆలోచ‌న‌కు గంటా శ్రీనివాస‌రావు వచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల విశాఖ‌కే చెందిన మ‌రో టీడీపీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ కూడా ఇలానే చేశారు. గంటా శ్రీనివాస‌రావు చంద్ర‌బాబు హ‌యాంలో, అంత‌కుముందు కిర‌ణ్ కుమార్ రెడ్డి హ‌యాంలో మంత్రిగా ప‌ని చేశారు.

అంగ‌బ‌లం, అర్థబ‌లం, సామాజ‌క‌వ‌ర్గ బ‌లం క‌లిగిన గంటా శ్రీనివాస‌రావు విశాఖ‌లో బ‌ల‌మైన నేత‌గా ఎదిగారు. ఆయ‌న గ‌త ఏడాదిగా వైసీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా ఆయ‌న మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. టీడీపీలోనూ యాక్టీవ్‌గా లేరు. అయితే, గంటా వైసీపీలో చేర‌కుండా విశాఖ‌కు చెందిన మంత్ర అవంతి శ్రీనివాస‌రావు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయినా కూడా గంటా వైసీపీలోకి రావ‌డానికి రూట్ క్లీయ‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది.

Related News