అల్లు అర్జున్ కు కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే కేరళ పోలీసులు ఈ క్రేజ్ ను వాడుతున్న విధానం చూసి బన్నీ అభిమానులే షాకవుతున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రజలకు అవసరమైన భద్రత సంబంధమైన విషయాలు, అవగాహనా కార్యక్రమాల్లో సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తుంటారు పోలీసులు.
కేరళ పోలీసులు కూడా ఇటీవల ఓ వినూత్న ప్రయోగం చేశారు. వారు రూపొందించిన పోల్ యాప్ ప్రచారానికి ఏకంగా బన్నీ సినిమాలోని ఒక వీడియో క్లిప్ నే వాడేశారు. ‘రేసు గుర్రం’ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ లో బన్నీ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపిస్తాడు. ఒక సీన్ లో బైక్ పై హీరో వేగంగా దూసుకొచ్చి హీరోయిన్ ను, కుటుంబాన్ని విలన్ల నుంచి కాపాడతాడు.
అచ్చం తాము రూపొందించిన పోల్ యాప్ ను ఉపయోగిస్తే పోలీసులు కూడా ఇలాగే దూసుకొచ్చి సహాయం చేస్తారని ఓ ప్రకటన చేశారు. అందుకోసం రేసు గుర్రం సినిమాలోని ఆ సీన్ ను జోడించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారుతుంది. బన్నీకి కేరళలో ఉన్న క్రేజ్ ఏమిటో ఈ ఒక్క సీన్ తో అర్థమైపోతుంది అంటున్నారు ఫ్యాన్స్.