logo

  BREAKING NEWS

‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |  

ప్రమాదానికి ముందే ఇంజిన్ ను ఆపేసిన పైలట్.. దర్యాప్తులో కీలక విషయాలు

వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి కేరళ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 20 కి చేరుకుంది. మరో 23 మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఈ ప్రమాదం సమయంలో విమానంలో మొత్తం 191 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, మిగిలిన 6 మంది విమాన సిబ్బంది ఉన్నారు.

కారిపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వర్షం కురుస్తుండటంతో రన్ వేపై విమానం కుదుపులకు లోనైంది. రన్ వే చివరి వరకు వెళ్లి జారిపడటంతో పక్కనున్న లోయలోకి పడిపోయింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. ఈ దుర్ఘటనలో పైలట్ దీపక్ సాఠే, కో పైలట్ అఖిలేష్ కుమార్ కూడా మృత్యువాత పడ్డారు. అఖిలేష్ కు ఏడాది క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

పైలట్ గా వ్యవహరించిన దీపక్ సాథే బోయింగ్ విమానాలు నడపడంలో నిష్ణాతుడు. భారత వాయు సేనలో వింగ్ కమాండర్ స్థాయి అధికారి. ఆయన ఇప్పటివరకు ఎంతో మంది పైలట్లకు శిక్షణనిచ్చారు. ఎన్డీఏలో రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ ను కూడా అందుకున్నారు. అయితే ప్యాసింజర్ విమానాలపై కూడా ఆయనకు ఎంతో పట్టుంది. అయినా ఈ ప్రమాదాన్ని ఆపలేకపోయారంటే ప్రమాద తీవ్రత ను అంచనా వేయవచ్చు.

అయితే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ దీపక్ సాథే కష్టకాలంలో ప్రదర్శించిన సమయస్ఫూర్తి కారణంగా పెను ప్రమాదాన్ని నివారించగలిగారు. ప్రమాదాన్ని ముందే అంచనా వేసి ఇంజన్ ను ఆపేసారు. దీంతో విమానం రెండు ముక్కలుగా విరిగినా మంటలు వ్యాపించలేదు. 2010 మంగుళూరు విమాన ప్రమాదంలో కూడా మంటలు రావడంతోనే భారీగా ప్రాణ నష్టం సంతప్పిందని దర్యాప్తులో వెల్లడైంది.

Related News