logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

కత్తితో పొడిచి.. కారుతో ఢీ కొట్టి భార్యను దారుణంగా హతమార్చిన భర్త

భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. భార్యపై కోపంతో ఓ వ్యక్తి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసాడు. కత్తితో పొడిచి ఆపై కోపం తీరకపోవడంతో కారుతో ఆమెను ఢీ కొట్టి చంపాడు. మృతురాలు కేరళకు చెందిన మెరీన్ జాయ్ గా గుర్తించారు. మేరీన్ కు ఫిలిప్ మాథ్యుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఓ బాబు ఉన్నాడు.

కాగా అమెరికాలోని ఓ హాస్పిటల్ లో మెరీన్ నర్సుగా పని చేస్తుంది. కుమారుడి విషయంలో భర్త తరచూ గొడవ పడుతుండటంతో భర్త కారణంగా ఆమె తన కొడుకుని కేరళలోని సొంత గ్రామంలో వదిలేసి భర్తతో అమెరికాకు వచ్చింది. అయినా వీరిద్దరి మధ్య వివాదాలు తగ్గలేదు. కాగా మంగళవారం నైట్ డ్యూటీ ముగించుకుని మెరీన్ కారు పార్కింగ్ సెల్లార్ లోకి వెళ్ళింది.

అదే సమయంలో అక్కడకు వచ్చిన భర్త ఆమెను వెనక నుంచి దాడి చేసాడు. ఆమె ఒంటిపై కత్తితో అనేక సార్లు పొడిచాడు. ఆ తర్వాత కారుతో ఢీ కొట్టించాడు. పోలీసులు అక్కడకు చేరుకునే సమయానికే ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. ఆసుపత్రికి తరలించగా మెరీన్ మరణించినట్టుగా వెల్లడించారు. కాగా ఆమె భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.

అంతలోనే తనకు కూడా గాయాలయ్యాయని అతను ఆసుపత్రిలో చేరాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసారు. కాగా భర భర్తల మధ్య హత్యకు దారీతీసే విధంగా ఏం జరిగింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related News