logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

అమెరికాకు 14 ఆవులను సాయంగా పంపిన కెన్యా ఆదివాసీ తెగ క‌థ‌

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం మ‌న దేశానికి భారీ న‌ష్టాన్ని తెచ్చిపెట్టింది. సెకండ్ వేవ్‌కు ముందు ప్ర‌పంచ దేశాల‌కు ఔష‌దాల‌ను, క‌రోనా వ్యాక్సిన్‌ను అందించి సంజీవ‌నిగా నిలిచింది భార‌త్‌. కానీ, ఊహించ‌ని రీతిలో సెకండ్ వేవ్ దేశంలో ఉధృతంగా వ్యాపించ‌డంతో ప‌రిస్థితులు మారిపోయాయి. క‌రోనా రోగుల చికిత్స కోసం ఆక్సీజ‌న్ కొర‌త త‌లెత్తింది. భార‌త్ ప‌రిస్థితిని చూసిన ప్ర‌పంచ దేశాలు భార‌త్‌కు అనేక ర‌కాల స‌హాయాలు చేస్తున్నాయి.

చాలా దేశాలు ఆక్సీజ‌న్ క‌న్‌స‌న్ట్రేట‌ర్లు, ఔష‌దాలు భార‌త్‌కు పంపిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని పేద దేశ‌మైన కెన్యా కూడా భార‌త్‌కు స‌హాయం చేసింది. 12 ట‌న్నుల ఆహార ఉత్ప‌త్తుల‌ను, టీ, కాఫీ పొడిని కెన్యా మ‌న దేశానికి పంపించింది. అంత‌కుముందు మ‌న దేశం కెన్యాకు క‌రోనా వ్యాక్సిన్‌ను పంపించింది. ఇందుకు కృత‌జ్ఞ‌త‌గా పేద దేశ‌మైన కెన్యా త‌న వ‌ల్ల అయినంత చిన్న సాయాన్ని భార‌త్‌కు చేసింది.

అయితే, ఆఖ‌రికి కెన్యా సాయాన్ని తీసుకునే స్థితికి భార‌త్‌ను దిగ‌జార్చార‌ని ప్ర‌తిప‌క్షాలు, సోష‌ల్ మీడియాలో కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌ను బీజేపీతో పాటు మ‌రి కొంద‌రు సాధార‌ణ నెటిజ‌న్లు కూడా త‌ప్పుప‌డుతున్నారు. సాయం పెద్దదా, చిన్నదా అని చూడొద్ద‌ని, పేద దేశ‌మైనా కూడా భార‌త్‌పై ప్రేమ‌తో కెన్యా సాయం చేసింద‌ని, దానిని గౌర‌వించాల‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో 2001లో జ‌రిగిన ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది. 2001 సెప్టెంబ‌ర్ 11న అల్‌ఖైదా ఉగ్ర‌వాదులు అమెరికాలోని ట్విన్ ట‌వ‌ర్స్‌లో కూల్చేచేశారు. ఇది అమెరికా ఎదుర్కొన్న అతి పెద్ద విప‌త్తుల్లో ఒక‌టి. అప్పుడు కెన్యాలోని మ‌సాయి అనే ఒక చిన్న ఆదివాసీ తెగ అమెరికాకు సాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చింది.

మ‌సాయి తెగ నాయ‌కుడు ఆ తెగ ప్ర‌జ‌ల‌తో అమెరికాలో జ‌రిగిన దాని గురించి చ‌ర్చించి త‌మ త‌ర‌పున ఏదైనా సాయం చేయాల‌ని భావించారు. అమెరికా లాంటి అగ్ర‌రాజ్యం, ఆర్థికంగా బ‌ల‌మైన దేశానికి తామేమీ సాయం చేయ‌గ‌ల‌మో చ‌ర్చించుకొని తాము ప్రేమ‌గా సాదుకున్న 14 ఆవుల‌ను ఇవ్వాల‌ని ఈ తెగ ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకున్నారు. 14 ఆవుల‌ను కెన్యాలోని అమెరికా ఎంబ‌సీకి తోలుకెళ్లి అప్ప‌గించారు. ఈ 14 ఆవుల‌ను అమెరికా ఏమాత్రం నామోషీ ప‌డ‌కుండా తీసుకుంది. ఒక చిన్న ఆదివాసీ తెగ త‌మ దేశం ప‌ట్ల ప్రేమ‌తో ఆవులు ఇచ్చినందున స్వీక‌రించింది.

బ‌హుశా 2001లో అమెరికా ప‌ట్ల మ‌సాయి తెగ వారు చూపించిన ప్రేమ‌నే ఇప్పుడు భార‌త్‌పై ఆ దేశం చూపించి ఉండ‌వ‌చ్చు. అనేక రంగాల్లో కెన్యాకు మ‌న దేశం అండ‌గా నిలుస్తోంది. ఈ కృత‌జ్ఞ‌త‌తో మ‌న దేశానికి కెన్యా తోచినంత సాయం చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. అయితే, కెన్యా లాంటి చిన్న దేశం నుంచి సాయం పొందాల్సిన స్థితికి భార‌త్‌ను తెచ్చార‌నే విమ‌ర్శ‌లు మాత్రం కొంద‌రూ చేస్తూనే ఉన్నారు.

Related News