logo

2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు

మేము ఎంత క‌ష్ట‌ప‌డినా స‌రే కానీ మా పిల్ల‌ల‌కు మాత్రం మంచి విద్య‌ను అందించాల‌నేది ప్ర‌తీ త‌ల్లిదండ్రుల‌కు ఉండే ల‌క్ష్యం. అయితే, ఈ రోజుల్లో ఒక ప్రైవేటు స్కూళ్లో నాణ్య‌మైన విద్య అందించాలంటే వేలు, ల‌క్ష‌ల‌తో కూడుకున్న ప‌ని. భారీ ఫీజులు చెల్లించ‌లేని వారు త‌మ పిల్ల‌ల‌కు మంచి చ‌దువును అందించాల‌నుకుంటే… కేంద్రీయ విద్యాలయాలు ఒక మంచి అవ‌కాశం. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంతోని కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్‌(కేవీఎస్‌) ఆధ్వ‌ర్యంలో న‌డిచే స్కూళ్ల‌లో త‌క్కువ ఫీజుల‌కే ఉత్త‌మ విద్యాబోధ‌న అందిస్తారు.

ఈ పాఠ‌శాలల్లో అడ్మిష‌న్ల‌కు ప్ర‌త్యేక ప్ర‌క్రియ ఉంటుంది. 2022 – 23 విద్యా సంవ‌త్స‌రానికి గానూ అడ్మిష‌న్ నోటిఫికేష‌న్‌ను కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ విడుద‌ల చేసింది. 1వ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల‌కు ఇప్పుడు అవ‌కాశం ఇచ్చింది. ఆన్‌లైన్‌లోనే అడ్మిష‌న్ ప్ర‌క్రియ ఉంటుంది. అడ్మిష‌న్ల కోసం ముందుగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభ‌మైంది.

పిల్ల‌ల ఫోటో, డేట్ ఆఫ్ బ‌ర్త్ స‌ర్టిఫికేట్‌, ఇన్‌క‌మ్ స‌ర్టిఫికేట్‌, సీడ‌బ్ల్యూఎస్ స‌ర్టిఫికేట్ క్యాస్ట్ స‌ర్టిఫికేట్ వంటివి ఆన్‌లైన్‌లోనే స‌మ‌ర్పించి త‌ల్లిదండ్రుల మొబైల్ నెంబ‌ర్‌, మెయిల్ ఐడీ ఇచ్చి అప్లై చేయాల్సి ఉంటుంది. మార్చ్ 21వ తేదీ సాయంత్రం 7 గంట‌ల‌ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయ‌డానికి kvsonlineadmission.kvs.gov.in లో లాగిన్ కావాల్సి ఉంటుంది.

1వ త‌ర‌గ‌తిలో అడ్మిష‌న్ తీసుకోవాలంటే పిల్ల‌ల క‌నీస‌ వ‌య‌స్సు ఆరేళ్లు ఉండాలి. గ‌రిష్ఠ వ‌య‌స్సు ఎనిమిదేళ్లు. ఇంత‌కుముందు క‌నీస వ‌యస్సు ఐదేళ్లే ఉండేది. కానీ, ఇప్పుడు కొత్త జాతీయ విద్యా విధానం ప్ర‌కారం ఆరేళ్ల‌కు పెంచారు. అంటే, 2014 ఏప్రిల్ 1 నుంచి 2016 ఏప్రిల్ 1వ తేదీ మ‌ధ్య పుట్టిన పిల్ల‌ల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. ఈ మార్చ్ 31 నాటికి క‌చ్చితంగా 5 సంవ‌త్స‌రాలు నిండి ఉండాలి.

కేంద్రీయ విద్యాల‌యాల్లో సీట్లు కొన్నే ఉంటాయి. కాబ‌ట్టి, అప్లై చేసిన వారంద‌రికీ సీటు దొర‌క‌దు. అడ్మిష‌న్లు ఎవ‌రెవ‌రికి ఇచ్చార‌నేది మార్చ్ 25న‌, ఏప్రిల్ 1న‌, ఏప్రిల్ 8న మూడు జాబితాల‌ను విడుద‌ల చేస్తారు. ఒక‌వేళ ఈ మూడు జాబితాల్లో ఎందులోనైనా విద్యార్థి పేరు ఉన్న‌ట్ల‌యితే అడ్మిష‌న్ ద‌క్కిన‌ట్లు. లేక‌పోతే అడ్మిష‌న్ రాలేద‌ని అర్థం. రెండ‌వ త‌ర‌గ‌తి, ఆ పైన త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌కు ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు ద‌రఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

Related News