కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై కెనడా ప్రధాన జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రైతుల దీక్షపై ఆందోళన వ్యక్తం చేసిన కెనడా ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఒక దేశంలో జరిగే ఆందోళనలు, నిరసనల విషయంలో మరో దేశం జోక్యం చేసుకోవడం పట్ల ఇక్కడి రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశమైన భారత అంతర్గత సమస్యలపై మీ జోక్యం తగదని బీజేపీ నేతలు ఆయనను హెచ్చరించారు కూడా. గతంలో రైతుల ఆందోళనల పట్ల స్పందించిన జస్టిన్ భారత్ లో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. వారికి తమ ప్రభుత్వం మద్దతు ఉంటుందన్నారు. ఈ వార్తలు గురించి తెలిసి కూడా స్పందించకుండా ఉండలేమన్నారు.
అక్కడ తమ కుటుంబం, స్నేహితుల గురించి తమ దేశంలో ఉన్న భారతీయులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రపంచంలో ఏ మూలన శాంతియుత నిరసనలు జరిగినా కెనడా మద్దతు వారికి ఉంటుందన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. జస్టిన్ వ్యాఖ్యలపై భారత్ లో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆ దేశ జర్నలిస్టు ఆయనను ప్రశ్నించారు.
అయితే జస్టిన్ అక్కడితో ఆగకుండా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. మరోసారి రైతుల దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని.. శాంతియుత నిరసనలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అయన తీరును బట్టి చూస్తుంటే జస్టిన్ ఈ విషయంపై వెనకు తగ్గినట్టుగా తెలుస్తుంది. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.