logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

దాతృత్వం చాటుకున్న సీఎం కేసీఆర్ సతీమణి..!

సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో పినతల్లి చేతిలో హింసకు గురైన ప్రత్యూషను సీఎం కేసీఆర్ దంపతులు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కుటుంబానికి కేసీఆర్ సతీమణి అండగా నిలిచారు. ఇటీవల కురిసిన వర్షాలకు కరీం నగర్ జిల్లా రామడుగు, మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా ధ్వంసం అవ్వడంతో కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు.

ఇంతలోనే అనారోగ్యం కారణంగా తిరుపతి మరణించాడు. అతని భార్యకు ఇది వరకే రెండు ఆపరేషన్లు జరిగి పని పిల్లలను పోషించుకోలేని పరిస్థితిలో ఉంది. ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోవడంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఉండటానికి ఇల్లు లేక అదే గ్రామంలో గల మున్నూరు కాపు కుల సంఘం భవనంలో తలదాచుకుంటున్నారు. ఈ వార్త తెలిసిన సీఎం సతీమణి చలించిపోయారు.

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కు ఫోన్ చేసి ఆ కుటుంబం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. మరికొంత మంది దాతలు కూడా అందించిన 2 లక్షల విరాళాలు కలుపుకుని మొతం రూ. 3 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి అందించారు.

అదే విధంగా ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కూడా కేటాయిస్తామన్నారు. వారి పిల్లలను చదువు పూర్తయ్యేంత వరకు గురుకుల పాఠశాలలో చదివిస్తామని, వారి బాగోగులు చూస్తామని హామీ ఇచ్చారు.

Related News