logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

జాతీయ స్థాయిలో కేసీఆర్ కొత్త పార్టీ‌..? పేరు ఇదే..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టారు. గ‌తంలో ఆయ‌న వివిధ ప్రాంతీయ పార్టీల‌ను క‌లుపుకొని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పెట్టాల‌ని భావించే వారు. కానీ, ఇప్పుడు ఆయ‌న కొత్త‌గా జాతీయ స్థాయిలో ఒక పార్టీనే పెట్టాల‌ని యోచిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇవాళ జ‌ర‌గ‌బోతున్న టీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలోనూ ఈ అంశంపై చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

జాతీయ పార్టీకి సంబంధించి ఒక పేరును కూడా కేసీఆర్ ఫైన‌ల్ చేసిన‌ట్లు చెబుతున్నారు. న‌యా భార‌త్ పార్టీ అనే పేరుతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించి ప్ర‌క్రియ కూడా టీఆర్ఎస్ ప్రారంభించింద‌ని తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే జాతీయ పార్టీ పెడ‌తామ‌ని టీఆర్ఎస్ నేత‌లు గ‌తంలోనే కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పుడు అడుగులు ప‌డుతున్న‌ట్లు అర్థం చేసుకోవాలి. పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ వివిధ రంగాల ప్ర‌ముఖుల‌తోనూ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ప‌లు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌ను కూడా క‌లుపుకొని వెళ్లి కొత్త పార్టీని స్థాపించాల‌నే ఆలోచ‌న‌తో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ వంటి వారు క‌లిసివ‌స్తార‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 2022 చివ‌రిలో లేదా 2023 మొద‌ట్ల జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా జాతీయ పార్టీని స్థాపించాల‌నే ఆలోచ‌న‌తో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

Related News